కరోనాపై తక్కువ అంచనా: ట్రంప్‌పై విరుచుకుపడుతోన్న చైనా

కరోనాపై తక్కువ అంచనా: ట్రంప్‌పై విరుచుకుపడుతోన్న చైనా
X
కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేసినందుకు ట్రంప్ దంపతులు భారీ మూల్యం చెల్లించారు అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కరోనా బారిన పడడం ఆందోళన కలిగించే అంశమే అయినా.. అతడు చేసిన తప్పిదాలే ట్రంప్‌కి కరోనా వచ్చేలా చేశాయని కొన్ని ఇస్లామిక్ దేశాలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ట్రంప్ త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వ్యాఖ్యానించగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేసినందుకు ట్రంప్ దంపతులు భారీ మూల్యం చెల్లించారు అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎగతాళి చేసింది. త్వరలో జరగబోయే అధ్యక్షఎన్నికలపై ఈ పరిణామం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని వ్యాఖ్యానించింది. ఇదే బాటలో మరికొన్ని దేశాలు ఇరాన్, సిరియా, ఇరాక్‌లోని ఇస్లామిక్ గ్రూపులు, టర్కీ నెగెటివ్‌గా స్పందించాయి. ఇప్పటికి కానీ తెలిసొచ్చిందా.. ప్రజలు పడుతున్న బాదేంటో ఇప్పటికైనా అర్థమవుతోందా అని అంటున్నారు.

కరోనా గురించి మొదటి నుంచి తేలిగ్గా తీసుకున్న ట్రంప్.. వైద్య నిపుణులు హెచ్చరించినా వారి అభిప్రాయాలను సైతం పెడ చెవిన పెట్టారు. దాంతో అగ్రరాజ్యంలోనే అధికంగా కరోనా కేసులు , మరణాలు సంభవించాయి. ఆ ప్రభావం ఆర్ధిక వ్యవస్థ మీద కూడా పడింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న క్రమంలో ట్రంప్ అప్రమత్తమయ్యారు. తన తప్పిదమేంటో తెలుసుకునే లోపు జరగాల్సింది అంతా జరిగిపోయింది.

అనంతరం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ అందరికంటే ముందు తీసుకురావాలనే ఆరాటం ఎక్కువైపోయింది. వ్యాక్సిన్‌ తన గెలుపుకు అవకాశంగా మలచుకోవాలనుకున్నారు. కానీ వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు అధ్యక్షుడు. దాంతో ఆయన, ఆయన భార్య ఇద్దరూ వైరస్ బారిన పడ్డారు. తన ప్రత్యర్థి బిడెన్‌తో తొలిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్న ట్రంప్ అతడినీ మాస్క్ పెట్టుకున్నందుకు హేళన చేశారు. అలా అన్నందుకు ఆయనే ఇప్పుడు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బిడెన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ట్రంప్‌కి వైరస్ సోకడం అందరికంటే ఎక్కువగా చైనాకు ఓ మంచి అవకాశంగా కనిపిస్తోంది.

Tags

Next Story