China: సరిహద్దులో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు
![China: సరిహద్దులో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు China: సరిహద్దులో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు](https://www.tv5news.in/h-upload/2024/05/31/1275007-gh300524int2a.webp)
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజాగా అత్యంత అధునాతనమైన ఆరు ‘జె-20 ఫైటర్ జెట్’లను సిక్కిం సమీపంలోని భారత్- చైనా సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది. 2020-23 మధ్య పలుమార్లు వీటిని అక్కడ నిలిపినా ఇన్నింటిని మోహరించడం ఇదే తొలిసారి. రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలను ధ్వంసం చేయడం వీటి ప్రత్యేకత. వాటిని ప్రయోగిస్తే మన సరిహద్దులోని కొన్ని లక్ష్యాలను ఛేదించడం చైనాకు తేలిక. దీనిపై భారత వైమానిక దళం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి విమానాలను సమర్థంగా తిప్పికొట్టేందుకు మనదగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి.
జిత్తులమారి డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇదిలా ఉంటే, సిక్కిం నుంచి కేవలం 150 కి.మీ దూరంలో చైనా తన అత్యాధునిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. టికెట్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాట్సేలోని ఎయిర్‌పోర్టులో ఆరు J-20 ఫైటర్ జెట్లను మోహరించింది. షిగాట్సే ఎయిర్‌పోర్టు మిలిటరీ, సివిలియన్ రెండు విధాలుగా పనిచేసేలా నిర్మించారు. ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటి. ఈ ఫైటర్ జెట్లతో పాటు J-500 ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా చిత్రాల్లో కనిపించింది. అయితే, భారత వైమానికదళం ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.
J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా యొక్క అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్సులో ఉన్నాయని సమాచారం. అయితే, అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. భారత్ ప్రస్తుతం 36 ఫ్రెంచ్- నిర్మిత రాఫెల్ యుద్ధవిమానాలతో J-20ని ఎదుర్కొంటుంది. వీటిలో 8 ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) తో అధునాతన వైమానిక పోరాట వ్యాయామాల కోసం అలాస్కాకు వెళ్లాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com