Bangladesh : చిన్మయ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్

Bangladesh : చిన్మయ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్
X

ఇస్కాన్ బంగ్లాదేశ్ గురువు చిన్మయ కృష్ణ దాస్ బ్రహ్మచారికి కి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాకరించింది. చిట్టాగ్రామ్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి మహమ్మద్ సైపుల్ ఇస్లామ్ బెయిల్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 25న చిన్మయ కృష్ణ దాస్ పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆయనను హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ కోసం అపూర్వ కుమార్ భట్టాచార్జీ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టుకు వెళ్లారు. తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరు పక్షాల నుంచి వాదనలు విన్నజడ్జి మహమ్మద్ సైపుల్ ఇస్లామ్ బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువరించారు.

Tags

Next Story