CIA : రండి.. మాతో చేతులు కలపండి

CIA : రండి.. మాతో చేతులు కలపండి
X

వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పాలనలో అణచివేతను ఎదుర్కొంటున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) కీలక ప్రకటన చేసింది. 'రండి.. మాతో కలిసి పనిచేయండి.. నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా కంట్రోల్లో ఉంచుకోవాలంటే సీఐఏలో చేరాలి' అంటూ మాండరిన్ భాషలో రెండు వీడియోలను విడుదల చేసింది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోల్లో.. జిన్పింగ్ కమ్యూనిస్టు పార్టీలో అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ఉదహరిస్తూ సినిమాటిక్ సన్నివేశాలను జోడించారు. నిజాయతీగా పనిచేస్తున్న ఓ పార్టీ నాయకుడు.. అధికార ఒత్తిళ్లకు తలొ గ్గాల్సిన పరిస్థితిలో ఉంటాడు. దాన్ని అంగీకరించలేక, భయంతో బతకలేక.. సీఐఏను ఆశ్రయిస్తున్నట్లుగా అందులో ఉంది. కాగా.. సైనిక పరంగా, వ్యూహాత్మకంగా చైనా తమకు అతిపెద్ద విరోధిగా భావిస్తున్న అగ్ర రాజ్యం.. బీజింగ్ చేపడుతున్న గూఢచర్య ఆపరేషన్లకు ప్రతిచర్యగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Tags

Next Story