Canada : కెనడాలో హిందూ సంఘాల ఆందోళన

Canada : కెనడాలో హిందూ సంఘాల ఆందోళన
X

కెనడాలోని సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో వీరంగం సృష్టించి భక్తులపై దాడులు చేయడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో బ్రాంప్టన్‌ హిందూ మహాసభ ఆలయం వెలుపల భారీ ర్యాలీ నిర్వహించారు. కెనడా, భారత్‌ జెండాలతో రాత్రి వెయ్యి మందికి పైగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ హిందూ ఫోబియా తగదని, ఇలాంటి దాడుల్ని కట్టడి చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ హిందూ సంఘాలు ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చాయి. ఇక ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ దృఢనిశ్చయాన్ని బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్టబద్ధ పాలనను నిలబెడుతుందని ఆశిస్తున్నామన్నారు. దాడి వెనక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందని ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

Tags

Next Story