Corona Deaths Worldwide: ఆగని కోవిడ్ మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా అరకోటి మంది..

Corona Deaths Worldwide: ఆగని కోవిడ్ మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా అరకోటి మంది..
Corona Deaths Worldwide: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసింది.

Corona deaths Worldwide: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసింది. మావన మనుగడకే ముప్పుగా మారిన కోవిడ్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. రెండేళ్లకాలంలో అరకోటిమంది దీనికి బలైపోయారు. కోవిడ్ కారణంగా చాలా దేశాలు అల్లాడిపోయాయి. పేద దేశాలు మరింత ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి.

మొత్తం మీద మానవ సమాజం కనివిని ఎరుగని ఉపద్రవాన్ని చవిచూసింది. అత్యాధునిక వైద్య వసతులున్న ధనిక దేశాల్లోని ఆసుపత్రులూ ఈ ఒత్తిడికి తాళలేకపోయాయి. యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, బ్రెజిల్‌ల దేశాల్లోనే సగం మరణాలు నమోదయ్యాయి. అగ్రదేశం అమెరికాలోనే ఏడున్నర లక్షలమంది మృత్యువాత పడ్డారు.

భారత ఉపఖండంలో జరిగిన యుద్దాల్లో.. వివిధ అంటువ్యాధులతో చనిపోయిన వారికంటే .. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉంది. 22 నెలల్లోనే అరకోటి మంది మహమ్మారికి బలయ్యారని, ఆ సంఖ్య పెరగకుండా చూసుకోవడమే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు అని అంటు వ్యాధుల నిపుణులు అంటున్నారు.

కొవిడ్‌ ఉద్ధృతి వేళ భారత్‌ తదితర దేశాల్లో పరీక్షలు పరిమితంగానే జరిగాయి. వైద్య సేవలు, అత్యవసర ఔషధాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది ఇళ్లలోనే ప్రాణాలు కోల్పోయారు. డెల్టా ప్రారంభంలో భారత్‌లో అత్యధిక కేసులు, మరణాలు చోటుచేసుకున్నాయి. చివరకు శ్మశానవాటికల్లో దహన సంస్కారాలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

కొన్నిదేశాల్లో ఏకంగా సామూహిక ఖననాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో సాంప్రదాయంగా చేయాల్సిన దహన సంస్కారాలను సైతం జేసీబీలతో గుంతలను తవ్విఖననం చేశారు. కోవిడ్ మహమ్మారి బంధు,మిత్ర సంబంధాలనుసైతం దూరంచేసింది. కోవిడ్ సోకి ఎంతో మంది అనాధలుగా ప్రాణాలుకోల్పోయారు.

కరోనాకుమూలమైన చైనాలో మళ్లీ కోవిడ్ కేసులునమోదు కావడం ఆందోళనకల్గిస్తోంది. దీంతో కోవిడ్ఆంక్షలను ఆదేశం మరింత కఠినం చేసింది. రాజధాని బీజింగ్‌లో హెల్త్‌ సిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతున్నారు. పర్యాటకాన్ని, పర్యటనలపై ఆంక్షలను కొనసాగిస్తున్నారు. అత్యవసరమైతేనేఇళ్లనుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌, తూర్పు ఐరోపా ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story