Corona in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. నిత్యావసరాల కోసం కూడా బయటికి వెళ్లకూడదు..
Corona in China (tv5news.in)
Corona in China: కరోనా.. ఇది ఎక్కడ నుండి పుట్టిందో సరిగ్గా తెలీదు కానీ.. ఇప్పటికీ మన జీవితాలను రిస్క్‌లో పడేస్తూనే ఉంది. చైనానే కరోనాకు కారణమని ప్రపంచమంతా నమ్ముతోంది. అయితే చైనా మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. చైనా వల్ల ప్రపంచమంతా సోకిన ఈ వ్యాధి ఇంకా దాని వల్ల సతమవుతూనే ఉన్నా.. ప్రస్తుతం కొన్ని దేశాల పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే చైనా మాత్రం కొత్త వేరియంట్‌తో కష్టాలు పడుతోంది.
కోవిడ్ తగ్గిపోయింది అనుకుంటుండగానే మళ్లీ కొత్తగా వేరియంట్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్ మనుషులను పీడిస్తోంది. అయితే చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కొన్నాళ్లు కరోనా కేసులు తగ్గడంతో లాక్‌డౌన్‌లో సడలింపులు చేసిన చైనా ప్రభుత్వం.. మరోసారి కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుందట.
చైనాలో మళ్లీ కఠినమైన లాక్‌డౌన్ అమలులోకి రానుందని సమాచారం. అందుకే అక్కడి ప్రభుత్వం ముందుగానే ప్రజలను సరిపడా నిత్యావసరాల సరుకులు కొని పెట్టుకోమని ఆదేశిస్తోంది. లాక్‌డౌన్ విధించిన తర్వాత సరుకులు కొనడం కష్టమని ఇప్పుడే సూచిస్తోంది. అంతే కాదు ఇకపై సరిహద్దుల్లో రాకపోకలు కూడా నిలిపివేయాలన్న ఆలోచనలో ఉందట చైనా. ఈ కోవిడ్ ప్రపంచమంతటా ఎన్నా్ళ్లకు తీరేనో..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com