కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికాకు అడుగడుగునా ఇబ్బందులు

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికాకు అడుగడుగునా ఇబ్బందులు
టీకాలు అందుబాటులోకి వచ్చినా వాటి పంపిణీ వేగం అశించిన స్థాయిలో కనిపించడం లేదు. టీకాల్లో అధికశాతం ఫ్రిడ్జ్‌ల్లోనే మిగిలిపోతున్నాయి.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికాకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీకాలు అందుబాటులోకి వచ్చినా వాటి పంపిణీ వేగం అశించిన స్థాయిలో కనిపించడం లేదు. టీకాల్లో అధికశాతం ఫ్రిడ్జ్‌ల్లోనే మిగిలిపోతున్నాయి. ఇప్పటివరకూ విడుదలైన టీకా డోసుల్లో దాదాపు 66 శాతం ఫ్రిడ్జ్‌లకు పరిమితమైనట్లు అక్కడి అరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడా, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో అక్కడి గవర్నర్లు అప్రమత్తమయ్యారు. టీకా పంపిణీకి బాధ్యత వహిస్తున్న ఆస్పత్రుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.

టీకాలు అందిన వారం లోపే ఆస్పత్రులు వాటిని ప్రజలకు వేయాలని.. అలా కాని పక్షంలో జరిమానా కట్టాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రులకు అందే టీకాల సంఖ్యను భవిష్యత్తులో తగ్గించాల్సి వస్తుందని అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో హెచ్చరించారు. న్యూయార్క్ ఆస్పత్రులు తమకు అందిన వాటిల్లో సగం కంటే తక్కువ టీకాలనే ప్రజలకు ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఫ్లోరిడా రాష్ట్రంలోనూ టీకా కార్యక్రమం నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి కేటాయించిన టీకాల్లో కేవలం పావు శాతం మాత్రమే ప్రజలకు చేరినట్టు అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సీడీసీ తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వేగవంతం చేసేందుకు అక్కడి ప్రభుత్వం మరో వెయ్యి మంది నర్సులను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది.



Tags

Read MoreRead Less
Next Story