High-Speed Rail : చైనా అద్భుతం.. గంటకు 450 కి.మీ.. ప్రపంచ రికార్డు సృష్టించిన CR450 రైలు.

High-Speed Rail : సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును నిర్మించింది. CR450 అనే కోడ్ పేరుతో పిలువబడుతున్న ఈ రైలు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉంది. ఈ ట్రయల్స్‌లో ఇది గంటకు 896 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే, వాస్తవ రైలు పట్టాలపై నిర్వహించిన ప్రయోగంలో ఈ రైలు గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
CR450 రైలు ప్రోటోటైప్‌ను 2024 నవంబర్‌లో నిర్మించారు. దీనికి అనేక టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం చివరి దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. షాంఘై-చాంగ్‌కింగ్-చెంగ్డూ హైస్పీడ్ రైల్వే లైన్‌లో ఈ ప్రోటోటైప్ రైలు ట్రయల్ రన్ నిర్వహించగా సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఈ ప్రయోగంలో ఇది గంటకు 450 కిలోమీటర్ల ఆపరేటింగ్ వేగాన్ని అందుకుని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు సృష్టించింది.
ఈ రైలు ఆపరేషనల్ టెస్టింగ్ కొనసాగుతుంది. దాదాపు 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించే వరకు దీని పనితీరుపై నిఘా ఉంచబడుతుంది. అంతా సజావుగా సాగితే, 2026లో ఈ రైలు కమర్షియల్ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రైలు కోడ్ పేరులో ఉన్న CR అంటే చైనా రైల్వే అని అర్థం.
గతంలో ఇదే చైనా రైల్వేకు చెందిన CR400 రైలు అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు కలిగి ఉండేది. ఇప్పుడు CR450 ఆ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాకుండా జపాన్ ప్రసిద్ధి చెందిన మాగ్లెవ్ రైలు కంటే కూడా CR450 ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. CR400 రైలు నిర్మాణం, స్వరూపంలో కొన్ని మార్పులు చేసి మరింత వేగంగా ప్రయాణించేలా దీని బరువును కూడా తగ్గించారు.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైళ్లు (టాప్ స్పీడ్)
ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైళ్ల జాబితాలో ప్రస్తుతం చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది
* చైనా CR450: 800 కిమీ కంటే ఎక్కువ వేగం (ట్రయల్ టాప్ స్పీడ్)
* చైనా షాంఘై మాగ్లెవ్: 501 కిమీ వేగం
* చైనా CR380: 486 కిమీ వేగం
* చైనా CR ఫక్సింగ్: 420 కిమీ వేగం
* జర్మనీ DB ICE: 350 కిమీ వేగం
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

