Telangana : నేపాల్ లో సంక్షోభం.. తెలంగాణ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్

నేపాల్ సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. హిమాలయ దేశంలో ఉన్న తెలంగాణ వాసులకు సహాయం చేయడం, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక సేవలు ప్రారంభించింది. ముగ్గురు అధికారుల బృందానికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోం ది. తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పేర్కొంది. తప్పుడు ప్ర చారాన్ని పట్టించుకోవద్దని సూచించింది. నేపాల్లో ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుంటే +91 9871999044 (వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ), +91 9643723157 (జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్) +91 9949351270 (సీహెచ్ చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) నంబర్లలో అధికారుల ను సంప్రదించవచ్చని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com