Iran : వాట్సాప్ డిలీట్ చేయండి .. పౌరులకు ఇరాన్ సూచన

వాట్సాప్ ను స్మార్ట్ ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని ఇరాన్ తమ దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. సంబంధిత మెసేంజర్ యాప్.. ఇజ్రాయెలు సమాచారం చేరవేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో ని టెలివిజన్లో ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. అయితే ఈ ఆరోపణలను వాట్సాప్ ను నిర్వహిస్తోన్న మెటా కంపెనీ ఖండించింది. ఈ రోజుల్లో ప్రజలకు అత్యంత అవసరమైన తమ సేవలు బ్లాక్ చేసేందుకు ఆ దేశం దీన్ని ఒక సాకుగా చూపిస్తోందని పేర్కొంది. వాట్సాప్ వ్యక్తుల లొకేషన్ ట్రాక్ చేయదని, అదే విధంగా వ్యక్తులు పంపించే మెసేజ్లను కూడా ట్రాక్ చేయమని స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వానికి కూడా తాము బస్క్ సమాచారం అందించమని వివరణ ఇచ్చింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానంతో మెస్సేజ్ పంపేవారికి, చేరే వారికి మాత్రమే తెలుస్తుందని పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఆధీనంలో వాట్సాప్ సేవలందిస్తోంది. నిజానికి ఇరాన్ కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లను నిషేదించింది. కానీ ప్రైవేటు నెట్ వర్క్లు, వీపీఎస్ ద్వారా యాక్సెస్ పొందుతున్నారు. 2022లో వాట్సాప్, గూగుల్ ప్లేల నిషేదం విధించిన ఇరాన్ గత ఏడాది బ్యాస్ ను తొలగించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com