ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టిందా..? తొమ్మిదేళ్ల పిల్లాడి వీడియో వైరల్

ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టిందా..? తొమ్మిదేళ్ల పిల్లాడి వీడియో వైరల్
X

ఆస్ట్రేలియాలో ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి వీడియో వైరల్ అవుతోంది. "నేను ప్రిన్సెస్ డయానాను. మళ్లీ పుట్టాను.. నమ్మట్లేదు కదూ? ఆ జన్మలో నేనేం చేశానో.. ఎలా చనిపోయానో చెప్పమంటారా?" అంటూ అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తున్నాడు. మహారాణి విషయాలను పూస గుచ్చిన ట్లుగా చెప్తుండటంతో వినేవారంతా నోరెళ్లబెడుతున్నారు.

ఆస్ట్రేలియా టెలివిజన్ పర్సనాలిటీ డేవిడ్ క్యాంప్బెల్ చిన్న కుమారుడు బిల్లీ క్యాంప్ బెల్ ఈ అసాధారణ విషయాలను తొలిసారి 2019లో కుటుంబసభ్యులతో పంచుకున్నాడు. రెండేళ్ల వయసు నుంచే తాను ప్రిన్సెస్ డయానా అని చెప్పడం మొదలెట్టాడంటున్న డేవిడ్ క్యాంప్బెల్.. ఆమె తిరిగిన ప్రాంతాలు, హాజరైన ఈవెంట్లతో సహాఅన్నీ పూసగుచ్చినట్లు చెప్తున్నాడు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ స్కాటిష్ రెసిడెన్స్ బల్మోరల్ కాజిల్ గురించి ఎన్నో విషయాలు వివరించేసరికి షాక్ కు గురయ్యానన్నారు.

చిన్న వయసులో ఉండగా తోబుట్టువు జాన్ స్పెన్సర్ చనిపోవడం, పారిస్ లోని కారు ప్రమాదం గురించి పూర్తిగా వివరించగా.. మెల్లగా నమ్మడం మొదలెట్టామన్నారాయన. ప్రిన్సెస్ డయానా గురించి తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న మాటలను తనకు ఆపాదించుకుని ఆ కుర్రాడు అలా చెబుతున్నాడని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

Tags

Next Story