Ukrainian : ఉక్రెయిన్ డ్రోన్లను ఎస్-400 గుర్తించలేదా?

Ukrainian : ఉక్రెయిన్ డ్రోన్లను ఎస్-400 గుర్తించలేదా?
X

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో మొదటిసారిగా రష్యాలోని సైనిక స్థావరాలపై భారీ ఎత్తున డ్రోన్లతో విరుచుకు పడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఐదు మేజర్ ఎయిర్వేస్ లను, 40కి పైగా ఫైటర్ జెట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. తమ దేశ సరిహద్దు నుంచి రష్యాలోని 4 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత వ్యూహాత్మకంగా చేదించినట్లు, ఏడాదిన్నర కాలంగా తామీ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. రష్యా వద్ద డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థలు ఎస్ -400, ఎస్ -500 ఉన్నాయి దగ్గర ఉన్న ఎస్-400 అడ్డుకునేది కదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇది ఎస్-400 వైఫల్యం ఎంత మాత్రం కాదని రక్షణ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ఈ వ్యవస్థ ఎక్కువ ఎత్తులో, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రోన్ల ను అడ్డుకునే విధంగా రూపొందింది. ఉక్రెయన్ మాత్రం రష్యా భూభాగంలోనికి ట్రక్కుల ద్వారా డ్రోన్లను చేర్చి రాడార్ వ్యవస్థకు చిక్కకుండా ప్ర యోగించింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో పొరుగు దేశం ఏడాది కాలంగా కొనసాగిస్తున్న వ్యూహాన్ని పసిగట్టడంతో రష్యా నిఘా సంస్థలు వైఫల్యం చెందాయనే అభిప్రాయాన్ని రక్షణ కదా? అవి పని చేయలేదా? ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ క్షిపణులు, డ్రోన్లను మన రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story