Bangladesh : బంగ్లాదేశ్‌లో అల్లర్లకు కారణాలు తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి మొదలైన నిరసనలు గొడవలకు దారితీశాయి. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ కోటాను 1972లో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని 2018లో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది.
హైకోర్టు మళ్లీ 30 శాతం కోటాను పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు.. కోటా చట్టవిరుద్దమని స్పష్టం చేసింది. వారసులకు 5 శాతం, ఇతర వర్గాలకు మరో 2 శాతం మాత్రమే రిజర్వ్ చేసింది. ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది. ఆందోళనల్లో చనిపోయినవారికి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జరిగిన గొడవల్లో దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు.
ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా ప్రత్యేక హెలికాప్టర్లో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం సైనిక పాలన దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హసీనా తండ్రి, బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజీబుర్ రెహ్మన్ విగ్రహాలు ధ్వంసం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com