Donald Trump & Benjamin Netanyahu : తగ్గని ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఆయిల్ సంక్షోభం తప్పదా..?

అమెరికా, ఇజ్రాయెల్ల ఎత్తులు పారట్లేదు. మొదటి అటాక్ లోనే అయతుల్లా ఖమేనీని చంపేస్తే ఇరాన్ పని అయిపోతుంది అనుకున్నారు. తమకు అనుకూల ప్రభుత్వం ఇరాన్ లో ఏర్పడుతుందని ప్లాన్ వేశారు. కానీ అదేం జరగలేదు. అయతుల్లా చనిపోయిన వెంటనే ఆయన కొడుకును సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. అంతే తప్ప ఇరాన్ వెనకడుగు వేయలేదు.. అమెరికా, ఇజ్రాయెల్ కు అస్సలు లొంగిపోలేదు. అమెరికా ఎన్ని బెదిరింపులు చేస్తున్నా.. ఎంత దాడులు చేస్తున్నా సరే ఇరాన్ మాత్రం తగ్గేదే లే అన్నట్టు రెచ్చిపోతోంది. ఇజ్రాయెల్ తో పాటు తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలపై భీకరంగా దాడులు చేస్తోంది. ఇక్కడ ఇరాన్ కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఆయుధ పరంగా అమెరికాతో గెలవలేం కాబట్టి.. ఆర్థికపరంగా గెలవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తలెత్తే విధంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలను సర్వనాశంన చేస్తోంది.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడుతోంది. అనుకున్నట్టుగానే అమెరికా, ఇజ్రాయెల్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ మాత్రం చర్చలు చేసేదే లేదు అన్నట్టు ఇంకా రెచ్చిపోతోంది. తాము ఎవరికీ లొంగిపోము అన్నట్టు భీకరంగా దాడులు చేస్తూనే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ మీద ఇరాన్ యుద్ధ తీరు చూస్తుంటే.. ఆ దేశం తన అస్తిత్వాన్ని కాపాడుకోడానికి బలంగా పోరాడాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.
దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మీద వివిధ దేశాల అధ్యక్షులు ఒత్తిడి తెస్తున్నారు. యుద్ధం ఆపేయాలని కోరుతున్నాయి. ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో చాలా దేశాలపై ఆర్థిక ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే రష్యా అమెరికాతో చర్చలు జరిపింది. ఇరాన్ తో కూడా మాట్లాడుతోంది. కానీ ఇరాన్ మాత్రం అమెరికా పెట్టే ఏ ఒక్క కండీషన్ కు ఒప్పుకోడానికి రెడీగా లేదు. మరి ఇప్పుడు అమెరికానే తగ్గుతుందా లేదంటే యుద్ధం ఇంకా కొనసాగుతుందా అనేది తెలియదు. ఒకవేళ యుద్ధం కొనసాగితే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తప్పదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
