Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ సినిమాలపై 100శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా వెలుపల చిత్రీకరించే చిత్రాలపై వందశాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు.చిన్నారి నుంచి క్యాండీ లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ వ్యాపారాన్ని ఆక్రమించాయని మండిపడ్డారు. ప్రధానంగా దీనివల్ల కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతిందన్నారు. బలహీనమైన, అసమర్థత కలిగిన కాలిఫోర్నియా గవర్నర్ వల్ల అక్కడ ప్రభావం పడుతోందన్నారు. దీనికి పరిష్కారంగా అమెరికా బయట చిత్రీకరించే చిత్రాలపై వందశాతం సుంకాలు

విధించనున్నట్లు చెప్పారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై.. తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అటు ఫర్నిచర్ దిగుమతులపైనా సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ చెప్పారు.

Tags

Next Story