U.S. Warns : తరగతులకు ఆటంకం కలిగించొద్దు : అమెరికా

అమెరికాలో చదువు కునేందుకు విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులు తరగతులకు ఆటంకం కలిగించొద్దని అమెరికా సూచించింది. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ కీలక ప్రకటన చేశారు. వీసాల కోసం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వారు ఎందుకైతే అప్లికేషన్ దేనికి పెట్టుకున్నారో దానికే ఆ వీసాను వాడుకోవాలని తెలిపారు. ఇక్కడికి వచ్చి వారు చదువును వదిలేయడం.. క్యాంపస్లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదన్నారు. తమ ప్రతి నిర్ణయం జాతీయభద్రతను దృష్టిలోపెట్టుకొని తీసుకుంటున్నద న్నారు. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని వెల్లడించారు. అమెరికా ఇమిగ్రేషన్ అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా చూస్తామని తెలిపారు. ఇవి కేవలం మా పౌరులను రక్షించడానికే కాదని, వారితోపాటు చదువుకొనే ఇతర విద్యార్థులను కాపాడటానికి కూడా అవసరమని వివరించారు. కొత్త దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిలో కచ్చితంగా 'పబ్లిక్ వ్యూ' ఆప్షనన్ను యాక్టివేట్ చేయాలని అమెరికా సూచించించారు. దీనిని పాటించకపోతే అప్లికేషన్ తిరస్కరిస్తామన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి వీసాలకూ పరిమిత కాల గడువు విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవు తోంది. దీంతో గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com