Gold Prices : బంగారం ధరలో డౌన్ ట్రెండ్.. మార్కెట్ లో ఆందోళన

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత గోల్డ్ మార్కెట్ భారీగా పతనమౌతోంది. ఈ నెల 4న ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్ లో గోల్గ్ భారీగా పడిపోతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ దాదాపు 5 వేల వరకు పడిపోయింది. డాలర్ ఇండెక్స్ అంతకంతకూ బలపడుతుండటం.. బులియన్ మార్కెట్‌ను బేరిష్ ట్రెండ్‌లోకి నెడుతుంది. ప్రస్తుతం బంగారం తులం 77వేల దరిదాపుల్లో ఉంది. నెలాఖరున మునుపెన్నడూ లేనివిధంగా 82 వేలు దాటింది గోల్డ్. హైదరాబాద్‌లో 22 క్యారెట్ గోల్డ్ తులం 70వేలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిదాకా డౌన్‌ట్రెండ్ కొనసాగవచ్చన్న అంచనాలే వినిపిస్తున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక, పాలసీ నిర్ణయాలు వచ్చేదాకా గోల్డ్ రేట్ కరెక్షన్ ఉంటుందంటున్నారు.గత 10 రోజులుగా బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌తోపాటు కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com