Drone Attack: భారత్‌కు వస్తున్న ఇజ్రాయెలీ మర్చెంట్ నౌకపై డ్రోన్ దాడి

అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్‌పై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పెంటగాన్ స్పష్టం చేసింది. దాడిని హౌతీ తిరుగుబాటుల పనిగా భావించారు. ఇటీవల కాలంలో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో అనేక నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా దాడి ఘటన ఇరాన్ పనేనని ధ్రువీకరించింది.
శనివారం ఉదయం 10 గంటలకు ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. దాదాపు 20 మంది భారతీయులతో సహా ట్యాంకర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. డ్రోన్ దాడితో ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. నౌకలో రసాయనాలు తరలిస్తుండటంతో దాడి కారణంగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన కారణంగా నౌకకు కొంత నష్టం జరిగిందని ఆంబ్రే సంస్థ పేర్కొంది. ఇండియావైపు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. ఘటనలో పెద్ద నష్టమేమి జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ట్యాంకర్ భారత తీరానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో దాడి జరిగింది. దాడి ఘటన తెలిసిన తర్వాత భారత నావికాదళం వెంటనే స్పందించింది. ట్యాంకర్‌ను రక్షించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ ఐసీజీఎస్‌ను పంపింది. ఎంవీ కెమ్ ప్లూటో షిప్ లైబీరియన్ జెండా కింద పని చేస్తుందని పెంటగాన్ పేర్కొంది.
అయితే దాడి సమాచారం అందగానే భారత్ నేవీ రంగంలోకి దిగింది. సాయం కావాలన్న విజ్ఞప్తి రావడంతో తాము స్పందించామని భారత నావికాదళ అధికారి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి యుద్ధ నౌకను పంపించామని చెప్పారు. కావాల్సిన సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఎర్రసముద్రంలో ఇటీవల వాణిజ్య నౌకలపై మిసైళ్లు, డ్రోన్ల దాడులు జరిగాయి. పాలస్తీనాకు మద్దతునిస్తున్న హౌతీలు ఈ దాడులు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సరుకు రవాణా, వాణిజ్య నౌకలు తమ ప్రయాణ మార్గం మార్చుకుంటున్నాయి. ఆఫ్రికా చుట్టూ తీరిగే సుదీర్ఘ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com