Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. సునామీ భయం

Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. సునామీ భయం
X

మయన్మార్‌ థాయిలాండ్ లో భూకంప విధ్వంసం మరచిపోక ముందే తాజాగా ఇండోనేషియాలో మరో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 2:48 గంటలకు భూమి కంపించిందని.. సిమెయులు రీజెన్సీలోని సినాబాంగ్ నగరానికి ఆగ్నేయంగా 62 కి.మీ దూరం, సముద్ర మట్టానికి 30 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.

అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోనకు గురయ్యారు. కాసేపటి ధాకా ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం మొదట 6.2 తీవ్రతతో నమోదు కాగా.. తర్వాత తీవ్రత తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తీవ్రమైన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టింది. కాగా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‎లో ఉన్న ఇండోనేషియా దేశంలో తరుచు భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలోనే గత నెల లో కూడా ఆ దేశంలో భూకంపం సంభవించింది. మాసోహి, కబుపటెన్ మలుకు టెంగా సమీపంలో 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది.

Tags

Next Story