U.S. : అమెరికాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అమెరికాను భూకంపం వణికించింది. అలాస్కా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
కాగా 1964 మార్చిలో ఈ రాష్ట్రంలో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అదిపెద్ద భూకంపంగా నిలిచింది. ఈ భూకంపం ఆంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది. అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలను ముంచెత్తి బీభత్సం సృష్టించింది. భూకంపం, సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు. మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com