Earthquake : రష్యాలో భూకంపం.. ఈ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరికొన్ని దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులున్నాయి.
1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవులు ఉన్నాయి. 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాలున్నాయి. 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com