PM : ప్రధాని ఎవరు? పాక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్కంఠ

PM : ప్రధాని ఎవరు? పాక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్కంఠ

మన దాయాది పాకిస్థాన్ లో పార్లమెంట్ (Pakistan Parliament) ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పాక్ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ ఎవరి పక్షం అనేది ఇంకా తేలలేదు. పొరుగు దేశంలో రెండు ప్రధాన పార్టీలు తమదే విజయమంటూ ప్రకటించుకున్నా, ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇంకా ఫైనల్ రిజల్ట్ ప్రకటించలేదు.

ఈవీఎంలు కాకుండా అక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. బ్యాలెట్ కౌంటింగ్ లేట్ అవుతోంది. ట్రెండ్స్ చూస్తుంటే.. పాక్ లో హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నాయి. జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ -పీటీఐ పార్టీకి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థులు దక్కించుకోవచ్చని అనుకుంటున్నారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- (పీఎంఎల్‌ - N) సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకునే చాన్సుంది.

నవాజ్‌ షరీఫ్‌ నాలుగో సారి ప్రధాని కావాలనుకుంటున్నారు. ఇందుకోసం బిలావల్‌ భుట్టో జర్దారీ కి చెందిన పీపీపీతో జత కలిసే చాన్సుంది. అలయన్స్ గవర్నమెంట్ ఏర్పాటు కోసం ముందుకు రావాలంటూ షరీఫ్ ను పలు రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. దూకుడు మీదున్న ఇమ్రాన్ పీటీఐ పార్టీ మాత్రం తాము సొంతంగానే పవర్ లోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరికొద్దిగంటల్లోనే ఈ రిజల్ట్ తేలిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story