Ashley St. Clair : ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి: ఆష్లే సెయింట్ క్లైర్

అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ ఆరోపించారు. ఆ బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని ఆమె తెలిపారు. తమ చిన్నారి గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని ఆమె వేడుకున్నారు. తన బిడ్డను సురక్షితంగా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.
ఆష్లే సెయింట్ క్లెయిర్ ఒక రచయిత్రి & సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తాను రాసిన "ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్" అనే పుస్తకంతో ఆమె ప్రసిద్ధి చెందారు. ఆ పుస్తకాన్ని బ్రేవ్ బుక్స్ ప్రచురించింది. ఈ పుస్తకం బయటకు వచ్చాక ఆమె పాపులర్ అయ్యారు. లింగ మార్పిడికి సంబంధించిన కొన్ని అంశాల ఆధారంగా "ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్" పుస్తకాన్ని ఆష్లే సెయింట్ క్లెయిర్ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com