US-China Trade War : ముదురుతున్న అమెరికా-చైనా ట్రేడ్ వార్

US-China Trade War : ముదురుతున్న అమెరికా-చైనా ట్రేడ్ వార్
X

అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. రెండు దేశాలు తగ్గేదేలే అంటూ పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. ఈ రెండు అగ్ర దేశాల ట్రేడ్ వారులో భారత్ ఎగుమతులకు మంచి రోజులు వస్తాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భారత ను కూడా టారీఫ్ కింగ్ ఆరోపించారు. ఇలా ప్రయోజనం పొందాలంటే ట్రంప్ భారత్ పై ఆంక్షలు విధించడానికి ముందే తప్పనిసరిగా అమెరికా అభ్యంతరం పెడుతున్న దిగుమతులపై భారత్ సుంకాలు తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పటికే బడ్జెట్లో హై ఎండ్ మోటార్ సైకిల్స్, కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించారు. ఇలా మరికొన్నింటిని కూడా తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలు విధించదు. లేకుంటే మెక్సికో, కెనడా, చైనా పై విధించినట్లుగానే భారత్పై కూడా సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. చైనాపై ఆంక్షలతో అమెరికాలోని వ్యాపారులు ప్రత్యామ్నాయాన్ని చూస్తారు. ఈ విషయంలో భారత్ మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి పదవీ కాలంలోనూ చైనాపై ఆంక్షలు, సుంకాలు విధించారు. ఈ సమయంలో ప్రయోజనం పొందిన వాటిలో భారత్ నాలుగో అతిపెద్ద దేశంగా ఉంది. రెండో సారి

Tags

Next Story