China: | భవనంలో ఘోర అగ్ని ప్రమాదం.. 15 మంది మృతి

చైనా భవనంలో మంటలు చెలరేగడంతో 15 మంది మృతి మృతి చెందారు. మరో 44 మంది గాయపడగా చికిత్స పొందుతున్నారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లోని నాన్‌జింగ్‌లో ఈ ప్రమాదం జరగ్గా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చైనాలో భారీ అగ్ని ప్రమాదం జరుగడం నెల వ్యవధిలో ఇది రెండోది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రిక్ సైకిళ్లు ఉంచిన భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జిన్హువా నివేదిక ప్రకారం.. నెలలో చైనాలో ఇది రెండవ అతిపెద్ద అగ్ని ప్రమాదం. ఫిబ్రవరి 23కి ముందు, తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని జిన్యు నగరంలో జనవరి 24న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com