North Macedonia : నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం.. 59 మంది మృతి

North Macedonia : నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం.. 59 మంది మృతి
X

ఉత్తర మాసిడోనియాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోకాని పట్టణంలోని ఓ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 59 మంది మృతి చెందగా, మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారని ఇంటీరియర్ మినిస్టర్ పాంచె తోష్కోవ్స్క తెలిపారు. ‘స్థానిక పాప్ గ్రూప్ (సంగీత బృందం) కోకాని పట్టణం లోని ఓ నైట్ క్లబ్లో కచేరీ నిర్వహించింది. రాత్రి 2.35 గంటల సమయంలో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. దీనితో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. యువతీయువకులంతా బయటకు పరుగులు తీశారు అని స్థానిక మంత్రి తెలిపారు. ఇది మాసిడోనియాకు చాలా విచారకరమైన రోజునీ.. చాలా మంది యువతీ యువకులు మరణించారు అని మాసిడోనియా ప్రధాన మంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తంచేశారు.

Tags

Next Story