Nepal Floods : నేపాల్ లో వరదలు.. రోడ్లపైనే మృతదేహాలు
హిమాలయన్ కంట్రీ నేపాల్ ను వరదలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు విషాదాన్ని మిగిల్చాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 150 మందికిపైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
వరదల్లో పదుల సంఖ్యలో గల్లంతుకాగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. వరదల్లో మరో 56 మంది గల్లంతుకాగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్ తూర్పు ప్రాంతంలో శుక్రవారం నుంచే కుండపోత వర్షాలు దంచి కొట్టాయి. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. కాట్మాండుకు సమీపంలోని భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 3 వేల మందిని రక్షించిన ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేపాల్‌లో ఈ స్థాయిలో వర్షాలు, వరదలు గత 40-45 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com