FRANCE: ఆందోళనకరంగా మారిన అల్లర్లు..
ఫ్రాన్స్‌లో పరిస్థితిలు ఆందోళనకరంగా ఉన్నాయి.పోలీసులు ఎంత ప్రయత్నించినా అల్లర్లు మాత్రం ఆగడం లేదు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించడంతో చెలరేగిన అల్లర్లు అదుపులోకి రావడం కష్టతరంగా మారాయ. పారిస్ శివారు ప్రాంతాల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ అల్లర్లు దేశమంతా పాకాయి. పలు భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు.దీంతో పారిస్ శివారులోని క్లామర్ట్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు.
మరోవైపు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్ ప్రారంభమైంది.అతడిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి.ఆందోళనకారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాలలకు, పోలీస్ స్టేషన్లకు, టౌన్ హాల్స్‌కు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి మంటలను ఆర్పడం కష్టతరమవుతోంది.దాదాపు 100 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లింది.ఒక్క పారిస్ ప్రాంతంలోనే 40వేల మంది పోలీసులను మోహరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com