Global Food Crisis: ఆహార సంక్షోభం దిశగా....
అంతర్జాతీయంగా(interbational) జరుగుతున్న విపరీత పరిణామాలతో ప్రపంచం ఆహార సంక్షోభం(Global Food Crisis) దిశగా పయనిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం(ukraine war), ప్రకృతి విపత్తులు(natural disastars), దాడులు, తిరుగుబాటులతో అంతర్జాతీయంగా నిత్యావసరాల ధరలు ఇప్పటితో పోలిస్తే మరింత పెరుగుతాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేయక తప్పదని హెచ్చరిస్తున్నాయి. దేశంలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది.
దేశంలో అకాల వర్షాల కారణంగా టమాటా(tomato) సహా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దాదాపు ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలు కొనలేని స్థాయిలో మండిపోతున్నాయి. నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆకాశాన్నంటుతున్న టమాటా ధరల(tomatos rate)పై కేంద్రం స్పందించి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాయితీపై టమాటా అందజేసి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది.
టమాటాలు మాత్రమే కాదు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం పైపైకి ఎగిసి పడుతున్నాయి. సాధారణంగా భారతీయ వంటకాల్లో వినియోగించే ప్రధాన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతున్నాయి. 2023 జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 4.49%గా నమోదైంది. పేద వర్గాల ప్రధాన ఆహారం బియ్యం, గోధుమ. గత సంవత్సరం గోధుమల సేకరణ తక్కువ జరగడంతో అవి వినియోగించే రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చౌక ధరల దుకాణాల ద్వారా పెద్ద మొత్తంలో బియ్యం అందిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల గోధుమలు/బియ్యం అందించింది. ఇది రేషన్ కార్డ్ హోల్డర్లు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గించింది. ఇప్పుడు అదనపు పరిమాణం జారీచేయని నేపథ్యంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలు గోధుమలు లేదా బియ్యం తప్పనిసరిగా మార్కెట్ ధరలకు కొనుగోలుచేయాల్సి వస్తోందని రైతులు, వినియోగదారులు చెబుతున్నారు.
ప్రపంచానికి అవసరమైన బియ్యంలో 40% భారతదేశమే సరఫరా చేస్తుంది. అయితే రుతుపవనాలు అస్థిరంగా కొనసాగిన కారణంగా కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని నిషేధిస్తూ జూన్ 20న నిర్ణయం తీసుకుంది. అయినా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. కూరగాయల ధరలు మరో నెల రోజుల్లో అదుపులోకి రావచ్చని రైతులు, వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com