Trump : కెనడాకు గోల్డెన్ డోమ్ ఆఫర్

కెనడాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదన చేశారు. యూఎస్ సెట్స్ లో ఆ కంట్రీ చేరితే గోల్డెన్ డోమ్ కింద ఫ్రీగా రక్షణ ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘అద్భుతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థలో కెనడా భాగం కావాలని నేను కోరుకుంటున్నా. ఇదే విషయాన్ని దేశానికి చెప్పా. అయితే విడిగా ఉంటూ ఈ వ్యవస్థలో చేరాలంటే కెనడాకు 61 బిలియన్ డాలర్ల మేర ఖర్చవుతుంది. అదే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే.. ఒక్క డాలర్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా రక్షణ ఇస్తం. ఈ ఆఫర్ ను వారు పరిగణనలోకి తీసుకుంటారని అనుకుంటున్నా' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో రాసుకొచ్చారు. కాగా.. ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' తరహాలో అమెరికా కోసం 'గోల్డెన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చ కానుంది. దీంతో అమెరికా ఇక స్పేస్లోనూ ఆయుధాలను మోహరించనుంది. 2029 చివరి నాటికి ఈ వ్యవస్థను అం దుబాటులోకి తేనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com