Trump Family : ట్రంప్ ప్రైవేట్‌జెట్‌లో మనవరాలు సందడి

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ పేరు బాగా వినిపిస్తోంది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు. అగ్రదేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ జెట్ లోపల ఎలా ఉంటుందో నెటిజన్లకు పరిచయం చేశారు. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. కై.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కుమార్తె. ఈ టీనేజర్ ఇటీవల తన తాతయ్యతో కలిసి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఓ భారీ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి టెక్సాస్‌లోని బ్రౌన్‌విల్లేకు వెళ్లారు. అప్పుడు ఈ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించారు. తర్వాత రాకెట్ లాంచింగ్‌ను వీక్షించారు. దానికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేసిన కై.. ‘ఎలాన్ మస్క్‌తో కలిసి స్పేస్‌ఎక్స్‌లో లాంచింగ్‌ను వీక్షించాను’ అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో కై తన స్నేహితురాలితో కలిసి జెట్ లోపల సందడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com