Greece fires: మంటలూ ఆర్పుతూ పేలిపోయిన విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

Greece fires: మంటలూ ఆర్పుతూ పేలిపోయిన విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
X
కార్చిచును ఆపేస్తున్న వేళ విమాన ప్రమాదం... ఇద్దరు పైలెట్ల దుర్మరణం

ద్వీపసమూహం గ్రీస్‌‍Greece fires‌)లో వారం రోజులుగా కార్చిచ్చు అడవులను దహించి వేస్తూనే ఉంది. ఆ మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన ఒక విమానం(firefighting plane crashes ) అదుపు తప్పి ప్రమాదవశాత్తు కుప్పకూలింది. మంటలు ఆర్పేందుకు విమానం నీటిని విడుదల చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం( plane crashed) సంభవించింది.


ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం( pilots have died) పాలయ్యారు. ఎవియా( Evia) అనే ద్వీపంలో CL-215 అనే విమానం మంటలపైకి నీటిని చిమ్ముతుండగా విమానం అంచు భాగం ఓ చెట్టు కొమ్మను తాకింది. ఆ కుదుపునకు విమానం ఉన్నపాటున కిందికి దూసుకెళ్లి నేలను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు మరణించారు.


విమానం(water-bombing plane) నేలను ఢీకొన్న వెంటనే క్షణాల్లోనే భారీ శబ్దంతో పెను విస్ఫోటనం జరిగింది. విమాన శిథిలాలను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు వైమానిక దళం తెలిపింది. ఐతే ప్రమాద సమాయాల్లో పైలెట్లు తప్పించుకునే ఎజెక్షన్‌ వ్యవస్థ ఆ విమానంలో లేనందున పైలెట్లు మరణించారని అధికారులు తెలిపారు.


కొద్ది రోజులుగా గ్రీస్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా కార్చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Tags

Next Story