Hamas Militant Leader : హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత సిన్వర్ హతం

ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో హమాస్ కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మిలిటెంట్ గ్రూప్ అధినేత, గత అక్టోబరు 7 దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్ ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. కాగా చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన వీడియో బయటకువచ్చింది. అయితే ఈ కదలికలను ఇజ్రాయెల్ డ్రోన్ రికార్డు చేసింది. ఓ భవనంలోని సోఫాలో సిన్వర్ కూర్చుని ఉండగా... డ్రోన్ దాన్ని చిత్రీకరించింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్... అతని డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. గతంలో అతడు ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న సమయంలో సేకరించిన డీఎన్ఏ నమూనాలతో వాటిని పరీక్షించి.. అతడి మరణాన్ని ధ్రువీకరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com