Indian Student : కెన‌డాలో హైద‌రాబాద్ యువకుడు మృతి

Indian Student : కెన‌డాలో హైద‌రాబాద్ యువకుడు మృతి
X

కెన‌డాలో హైద‌రాబాద్ యువకుడు మృతి చెందాడు. హైద‌రాబాద్ మీర్‌పేట‌కు చెందిన ప్రణీత్.. కెన‌డాలో ఎంఎస్ చదువుతున్నారు. త‌న అన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి టోరంటోలోని లేక్ క్లియ‌ర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాద‌వ‌శాత్తూ నీట మునిగి ప్రణీత్ చ‌నిపోయారు. మృతుడి త‌ల్లిదండ్రుల‌కు స్నేహితులు స‌మాచారం అందించారు. దీంతో హైద‌రాబాద్ మీర్‌పేట‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ప్రణీత్ త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మృత‌దేహాన్ని వీలైనంత త్వర‌గా హైద‌రాబాద్‌కు తెప్పించాల‌ని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Tags

Next Story