Zelensky : ట్రంప్‌కు క్షమాపణ చెప్పను: జెలెన్‌స్కీ

ఓవెల్ ఆఫీస్ ఘటనపై ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకోవటం లేదని, అయితే అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానని ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని కోరారు. ఉక్రెయిన్‌లోని ఖనిజాల తవ్వకం ఒప్పందంపై భేటీలో USనుంచి రక్షణ కావాలని జెలెన్‌స్కీ ఒత్తిడి చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.
వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com