Former Pakistan PM : ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు, భార్యకు 7 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు లోకల్ కోర్టు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఆయన భార్యకు సైతం ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ దేశ ఖజానాకు 190 మిలియన్ పౌండ్ల నష్టం కలిగించారని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) 2023 డిసెంబర్ లో కేసు నమోదు చేసింది. ఒకవేళ ఈ జరిమానాలను చెల్లించకపోతే ఇద్దరూ అదనంగా మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం బీబీ బుష్రాను అదుపులోకి కూడా తీసుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్ దంపతులు అల్ ఖాదిర్ ట్రస్ట్ అనే ఫౌండేషన్ 1996లో స్థాపించారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసం ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. అయితే, ఈ ఫౌండేషన్ చాటున అక్రమాలు జరిగినట్టు పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) కేసు దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ నిందితులుగా చేర్చింది. బిలియన్ల రూపాయల విలువైన భూమిని, డబ్బును కాజేసినట్టు ఆరోపించారు. వీటిపై కోర్టు తాజాగా విచారణ జరిపిన అనంతరం తీర్పును వెల్లడించింది. తాజా కోర్టు తీర్పుతో ఇమ్రాన్ మరికొన్నేళ్ల పాటు జైలుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, పీటీఐ పార్టీ నాయకత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com