నేపాల్‌కు ఆపన్న హస్తం అందించిన భారత్

ఇటీవల నేపాల్.. భారత్‌తో తరుచూ వివాదాలకు దిగుతుంది. అయినప్పటికీ భారత్ ఆపన్న హస్తం అందించింది. ఈ ఏడాది భూకంపాలు, ప్రకృతి విపత్తులతో దెబ్బతిన్న ఇళ్ల పునరుద్దరణ ప్రాజెక్ట్ కోసం1.54 బిలియన్ నేపాలీస్ రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నేపాల్‌లో భారత రాయబార కార్యాలయానికి చెందిన డిప్యూటీ చీఫ్ నాంగ్యా ఖంపా, ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిషీర్ కుమార్ ధుంగనాకు ఈ చెక్కును అందజేశారు. ఈ ఏడాది భారత్ పట్ల నేపాల్ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పుకు ప్రధాన కారణం చైనా అని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా ఒత్తిడితోనే నేపాల్ విభేదాలకు దిగుతుందని అంటున్నారు. భారత్ లోని భూభాగాలను తమవిగా చూపిస్తూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య దూరం పెరిగింది. శ్రీరాముడి జన్మస్థలం అయోద్య కాదని.. నేపాల్ లో ఉందని నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ దూరం మరింత పెరిగింది. అయినప్పటికీ భారత్ నేపాల్‌కు అండగా నిలుస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com