Modi-New Zealand: న్యూజిలాండ్ తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారతదేశం-న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వే్చ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా జరిగింది. ప్రధాని మోడీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. అనంతరం చారిత్రాత్మక, ప్రతిష్టాత్మకమైన పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా జరిగిందని సంయుక్తంగా ప్రకటించారు.
9 నెలల చర్చల తర్వాత ఒప్పందం తుది రూపం దాల్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా చర్చలు జరిగాయి. ఇన్నాళ్లకు తుది రూపం దాల్చింది. సోమవారం చర్చలు ఫలించినట్లుగా నేతలిద్దరూ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం కోసం ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇరువురి నాయకులు చెప్పారు.
రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారతదేశంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు, యువతకు కొత్త అవకాశాలు కూడా రానున్నాయి. ఫోన్ సంభాషణ తర్వాత న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ ఎక్స్‌లో కీలక పోస్ట్ పెట్టారు. భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిశాయని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

