చైనా అధికారిక పత్రికలో భారత్‌పై విష ప్రచారం..

చైనా అధికారిక పత్రికలో భారత్‌పై విష ప్రచారం..
కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చైనా సైన్యం గాల్లో కాల్పులు జరిపినా..మన సైనికులు సంయమనం పాటించారని సైనిక అధికారులు తెలిపారు.

డ్రాగన్‌ కంట్రీ చైనా ఈ సారి మరింత బరితెగించింది. భారత జవాన్లు తమ దేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడాన్ని అడ్డుకోవడంలో భాగంగా వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందనే ఆరోపణలను గుప్పిస్తోంది. దీంతో వాస్తవాధీనరేఖ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత జవాన్లను నియంత్రించడానికి చైనా బలగాలు వార్నింగ్ షాట్ ఫైరింగ్‌ నిర్వహించాయని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు పీఎల్ఏ అధికార ప్రతినిధి వెల్లడించారు. అటు.. వాస్తవాధీన రేఖ- LAC దాటి మన సైన్యం కాల్పులు జరిపిందన్న వార్తల్ని... ఇండియన్ ఆర్మీ ఖండించింది. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి హెచ్చరికల కాల్పులు జరపలేదని స్పష్టం చేసింది.

1975లో తొలిసారిగా వాస్తవాధీనరేఖ వెంబడి ఈ రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1975 అక్టోబర్ 20వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా పాస్ సమీపంలో చైనా సైనికులు భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించగా... భారత జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అస్సాం రైఫిల్స్‌కు చెందిన చైనా బలగాలను అడ్డుకున్నాయి. ఈ కాల్పుల్లో చైనాకు చెందిన నలుగురు సైనికులు మరణించారు. మళ్లీ తాజాగా.. ఆ తరువాత సరిహద్దుల్లో కాల్పులు జరిపేంతటి ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ఎప్పుడూ సంభవించలేదు. తరచూ చైనా బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం.. జవాన్లు వారిని నిలురించడం వంటి సందర్భాలు చాలా ఉన్నాయి.

ఈ సారి వారి దృష్టి లద్దాఖ్‌ వైపు పడింది. భారత్-చైనా మధ్య లఢక్ సరిహద్దుల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి. వాస్తవాధీనరేఖ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారు. భారత జవాన్లు వారితో ఘర్షణ పడాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్ 16న చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఆ దేశం దాన్ని ధృవీకరించలేదు. కిందటి నెల 29, 30 తేదీల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సారి కాల్పుల దాకా వెళ్లింది పరిస్థితి.

అయితే.. LAC వెంట ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు సంప్రదింపులకు, చర్చలకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ సమయంలోనే చైనా బలగాలు రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింతగా దిగజారుతున్నాయని సైన్యం తెలిపింది. చైనా ఎంతగా కవ్వించినా సంయమనం పాటిస్తున్నట్టు భారత సైన్యం పేర్కొంది. నిబంధనలను చైనా సైన్యమే అతిక్రమిస్తోందని తెలిపింది. చైనా దళాలు మంగళవారం సరిహద్దుకు అతిసమీపంగా వచ్చాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చైనా సైన్యం గాల్లో కాల్పులు జరిపినా... మన సైనికులు సంయమనం పాటించారని సైనిక అధికారులు తెలిపారు. ఇప్పుటికే దురుసు వైఖరితో కాలుదువ్వుతున్న చైనా.. తన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వేదికగా స్వరం పెంచుతోంది. భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ.. ఆ పత్రికలో సంపాదకీయం ప్రచురించింది.

Tags

Read MoreRead Less
Next Story