Indian-Origin Politicians : అమెరికా ఎన్నికల్లో మనోళ్లు గెలిచారు

Indian-Origin Politicians : అమెరికా ఎన్నికల్లో మనోళ్లు గెలిచారు
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. అందులో ఇల్లినోయిస్ నుంచి పోటీ చేసిన రాజా కృ ష్ణమూర్తి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి శ్రీ థానేధర్ మిచిగన్ నుంచి విజయం సాధించారు. ఎన్నికల్లో 62.8 శాతం ఓట్లను సాధించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున మరో భారతీయ అమెరికన్ రో ఖన్నా కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే డా. అమిష్ షా అరిజోనా నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక వర్జీనియా స్టేట్ నుంచి సెనేటర్ గా సుబ్రహ్మణ్యన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పై విజయం గెలుపొందారు. గతంలో ఆయన బరాక్ ఒబామాకు అడ్వై జర్ గా వైట్ హౌస్ లో పనిచేశారు. మరో భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ లోని 7వ కాంగ్రెషియోనల్ జిల్లా నుంచి డెమోక్రటిక్ పార్టీ తరపున విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 6వ జిల్లా కాం గ్రేషియోనల్ నుంచి అమీ బెరా గెలుపొందారు. జెరెమే కూనీ డెమోక్రటిక్ పార్టీ తరపున న్యూయార్క్ లోని 56వ స్టేట్ సెనెట్ జిల్లా నుంచి విజయ దుంధుబి మోగించారు. కాగా ఈసారి జరిగిన ఎన్నికల్లో 36 మందికి పైగా భారతీయ అమెరికన్లు పోటీ చేశారు. దాదాపు 2.6 మిలియన్ల మంది భారత అమెరికన్లు ఓటు హక్కును కలిగి ఉన్నారని ఇండియన్ అమెరికన్ అటిట్యూడ్స్ సర్వే 2024 వెల్లడించింది.

Tags

Next Story