USA: ఆటపట్టించినవారిని కారుతో గుద్ది చంపేశాడు
ఒక్కోసారి ఎదుటి వాళ్ళు చేసిన పని మనకు మహా చిరాకు తెప్పిస్తుంది.. అప్పుడు ఏం చేస్తాం.. విసుక్కుంటాం, తిడతాం, చిరాకు పడతాం.. సాధారణంగా ఇదే జరుగుతుంది.
అమెరికాలో ఇలా ఎవరినన్నా విసిగిస్తే అక్కడి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ సీరియస్గా రియాక్ట్ అవుతారు.. ఆయుధం అందుబాటులో ఉంటుంది కాబట్టి తమ ప్రైవసీభంగం కలిగించిన వారిపై దాడులకు పాల్పడతారు.. అమెరికాలో ఉన్న ఓ ఇండియన్ కూడా ఇలాగే దాడి చేసి చివరికి కటాకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే జనవరి 19, 2020 రాత్రి కాలిఫోర్నియాలో టెమెస్కల్ కాన్యన్ రోడ్‌లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు యువకులు 2002 నాటి టయోటా ప్రియస్ కారులో తమ స్నేహితుడి ఇంటికి స్లీపోవర్ కి వారిలో ఒకరు పక్కనే ఉన్న అనురాగ్ చంద్ర డోర్ బెల్ పలుమార్లు మోగించి ఆటపట్టించాడు. అయితే అనురాగ్ చంద్ర చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడంతో వారు ఆరుగురు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అనురాగ్ తన కారులో వారిని వెంబడించి ఢీకొట్టాడు. దీంతో వారి వాహనం చెట్టుకు గుద్దుకొని అందులో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. 18 ఏళ్ల డ్రైవర్‌తో పాటు 13 ఏళ్ల,14 ఏళ్లు కలిగిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అనురాగ్ చంద్ర ఎవరికీ ఏమీ తెలియజేయకుండా ఇంటికి వచ్చాడు.
2020 జనవరి 20న పోలీసులు అనురాగ్ ను అరెస్టు చేశారు. అరెస్టైన అనురాగ్ చంద్ర అప్పటి నుండి రివర్ సైడ్ లోని రాబర్డ్ ప్రెస్లీ డిటెన్షన్ సెంటర్‌లో కస్టడీలో ఉన్నాడు. మరో కేసులోనూ దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న్న అనురాగ్ చంద్ర నేరాన్ని అంగీకరించాడు. అయితే ఘటన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని, కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన చెందానని, వారు చనిపోవాలని తాను కోరుకోలేదని అనురాగ్ చంద్ర కోర్టులో వాదించాడు. అయితే సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు... అతడు కావాలనే కుర్రాళ్ల కారును గట్టిగా ఢీకొట్టినట్టు నిర్ధారించింది. నేరం రుజువైన నేపథ్యంలో ఎలాంటి పెరోల్ కు అవకాశం లేకుండా ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
రివర్ సైడ్ కౌంటీలోని జ్యూరీకి ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి మూడు గంటలు పట్టినట్లు జిల్లా అటార్నీ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com