America : వైట్ హౌస్ పై దాడికి ప్లాన్ చేసిన భారతీయుడికి 8 ఏళ్ళ జైలు శిక్ష

రెండేళ్ల క్రితం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేసేందుకు ప్రయత్నించిన భారత సంతతి వ్యక్తి సాయి వర్షిత్ కు 8 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2023, మే 22వ తేదీన 20 ఏళ్ల కందుల సాయి తన వద్ద ఉన్న ఓ ట్రక్కుతో వైట్‌హౌజ్‌పై దసూకెళ్లిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూల్చి.. నియంతృత్వ నాజీ ఐడియాలజీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కందుల సాయి ఆ దాడి చేసినట్లు న్యాయశాఖ పేర్కొన్నది.
నేరం చేసినట్లు అంగీకరించిన సాయి.. తనపై శిక్షను తగ్గించాలని కోరాడు. ఇండియాలోని చండీఘడ్‌లో పుట్టిన సాయి వర్షిత్‌కు.. అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్ష్‌కు కావాల్సిన గ్రీన్ కార్డు ఉన్నది. 8 ఏళ్ల జైలుశిక్షతో పాటు కందుల సాయి మూడేళ్ల పాటు సేవ చేయాలని జిల్లా కోర్టు జడ్జి డాబ్నే ఫ్రెడ్రిచ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే?
మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి కమర్షియల్ విమానంలో.. 2023, మే 22వ తేదీన వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు సాయి. వన్‌వే ఎయిర్‌లైన్ టికెట్‌తో అతను ప్రయాణం చేశాడు. 5.20 నిమిషాలకు అతను డుల్లేస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఆ తర్వాత 6.30 నిమిషాలకు అతను ఓ ట్రక్కును కిరాయి తీసుకున్నాడు. కిరాయి తీసుకున్న ట్రక్కుతో వాషింగ్టన్ డీసి వెళ్లాడు. వైట్‌హౌజ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న బారియర్లను ట్రక్కుతో ఢీకొట్టాడు. రాత్రి 9.35 నిమిషాల సమయంలో ఈ ఘనట జరిగింది.
బారియర్లను ఢీకొన్న తర్వాత ట్రక్కును రివర్స్ చేశాడు. రెండోసారి మెటల్ బారియర్లను ఢీకొట్టాడు. ట్రక్కు మొరాయించడంతో .. లీకేజీ మొదలైంది. వాహనం దిగి వెనక్కి వెళ్లి.. బ్యాక్‌ప్యాక్ నుంచి ఓ జెండా తీశాడు. నాజీ స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యానర్ ప్రదర్శించాడు. ఆ సమయంలో అమెరికా పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. వైట్‌హౌజ్‌లోకి వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ట్రక్కుతో దాడికి దిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com