H1B Visas : ఇండియన్ల వద్దే 72శాతం H1B వీసాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ MS చదివేందుకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే MS పూర్తి చేసిన వారు లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు వీలుండదు.
అమెరికా ప్రభుత్వం జారీచేసే H1B వీసాలు అత్యధికంగా ఇండియన్ల వద్దే ఉన్నాయి. FY2022 వరకూ జారీచేసిన వాటిల్లో భారతీయుల వద్ద 72.6శాతం.. అంటే 3,20,791 వీసాలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత చైనాకు చెందిన 55,038(12.5%) మంది వద్ద H1B వీసాలున్నాయి. అలాగే కెనడా వద్ద ఒక శాతం(4,235), సౌత్ కొరియా వద్ద 0.9శాతం(4,097) ఉండగా, ఫిలిప్పీన్స్ ప్రజలు 0.8శాతం (3,501) వీసాలు కలిగిఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com