అంతర్జాతీయం

కొవాగ్జిన్‌ పనితీరు భేష్ అని మెచ్చుకున్న అమెరికా..!

కొవాగ్జిన్‌ పనితీరు భేష్ అని మెచ్చుకుంది వైరస్‌ను కొవాగ్జిన్ సమర్ధంగా ఎదుర్కొంటుందని అమెరికా ప్రభుత్వ ప్రధాన వైద్యరంగ సలహాదారు ఆంటోని ఫౌచీ ప్రకటించారు.

కొవాగ్జిన్‌ పనితీరు భేష్ అని మెచ్చుకున్న అమెరికా..!
X

కొవాగ్జిన్‌ పనితీరు భేష్ అని మెచ్చుకుంది అమెరికా. ముఖ్యంగా డబుల్ మ్యుటెంట్‌ వైరస్‌ను కొవాగ్జిన్ సమర్ధంగా ఎదుర్కొంటుందని అమెరికా ప్రభుత్వ ప్రధాన వైద్యరంగ సలహాదారు ఆంటోని ఫౌచీ ప్రకటించారు. భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌.. కరోనా 617 వేరియెంట్లను సైతం చంపేస్తుందని సర్టిఫికేట్ ఇచ్చారు. గతేడాది బారత్‌లో గుర్తించిన B.1.617 స్ట్రెయిన్‌పై కొవాగ్జిన్‌ టీకా పనిచేస్తుందని ఆంటోనీ అన్నారు.

కరోనా ఇన్ఫెక్షన్‌ సోకిన వారి ప్లాస్మా శాంపిళ్లు, కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనకు సంబంధించిన సమాచారాలను విశ్లేషించిన తరువాత.. దాని ఫలితాన్ని ప్రకటించింది అమెరికా. కొవాగ్జిన్ వేయించుకుంటే సీరియస్‌ కండీషన్‌లో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు వందకు వంద శాతం ఉండవని ఈ టీకాను తయారుచేస్తున్న భారత్‌ బయోటెక్ ప్రకటించింది. కరోనా సోకినప్పటికీ ప్రాణాంతకంగా మారకుండా కొవిగ్జిన్ వ్యాక్సిన్‌ అడ్డుకోగలిగిందని ప్రకటించింది భారత్ బయోటెక్.

భారత్‌లో రోజుకు దరిదాపున 4 లక్షల కేసులు నమోదవుతున్నందున.. కరోనాను కట్టడి చేయాలన్నా, మరణాల రేటును తగ్గించాలన్నా వ్యాక్సినేషనే ఉత్తమ మార్గమని ఫౌచీ అభిప్రాయపడ్డారు. మరోవైపు సార్క్‌-కోవ్‌-2 వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు విడుదల చేయడంలోనూ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పని చేస్తుందని న్యూయార్క్‌ టైమ్స్‌ సైతం చెప్పింది. నేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ భాగస్వామ్యంతో కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసింది భారత్‌ బయోటెక్‌. ఈ ఏడాది జనవరి 3న దేశంలో అత్యవసర వ్యాక్సిన్‌ వినియోగం కోసం కొవాగ్జిన్‌కు అనుమతి లభించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత టీకా 78 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.

హైదరాబాద్‌ కేంద్రంగా జీనోమ్ వ్యాలీలో తయారైన కొవాగ్జిన్‌ టీకా ధరలను తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకా ధర ఒక డోసుకు 600 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర ఒక్కో డోసుకు 1200 రూపాయలుగా ఉంటుందని చెప్పింది. ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యాక్సిన్ ధరలు ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్లుగా ఉంటాయని స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES