Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారట.. చనిపోయిన వారి నీడలు..

Interesting Facts About Death: చావు అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కానీ కేవలం ఒక్కసారే దాని డెఫినిషన్ అర్థమవుతుంది. అలా అర్థమయిన తర్వాత జీవితం అనేది ముగిసిపోతుంది. అయితే ఈ చావు గురించి బతికుండగానే ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలని ఎంతోమంది ప్రయత్నించారు. అయితే అమెరికాకు చెందిన ఓ నర్సు చావుకు ముందు మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేదాని గురించి చాలా అవగాహనే తెచ్చుకుంది.
అమెరికాకు చెందని జూలీ దాదాపు 14 యేళ్లుగా నర్సుగా పనిచేస్తోంది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా లాంటి సిటీల్లో పనిచేసిన అనుభవం తనకుంది. నర్సుగా పనిచేసిన తను.. తన సర్వీసులో ఎంతోమంది మరణించడం చూసింది. అయితే చనిపోయే ముందు అందరి వ్యక్తుల ప్రవర్తన దాదాపు ఒకేలా ఉంటుందట. అంతే కాక వారందరు ఒకే విషయం గురించి మాట్లాడేవారని జూలీ చెప్తుంది.
మరణించే ముందు ఎవరి శరీరమైనా రంగు మారుతుందని జూలీ అంటుంది. అంతే కాక వారికి జ్వరం కూడా వస్తుందట. అంతే కాక వారికి ప్రియమైన వారి పేరును కూడా పదే పదే తలచుకుంటూ ఉంటారట. వారికి 'ఐ లవ్ యూ' చెప్పడం లాంటివి కూడా చేస్తుంటారట. అంతే కాక అప్పటికే మరణించిన వారికి ఫోన్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నించారని జూలీ అంటుంది.
ఇవి మాత్రమే కాదు.. చాలామంది చనిపోయే ముందు నీడలు కూడా చూసారట. తమకు చాలా దగ్గరయి, అప్పటికే మరణించిన వారి నీడలు చూడడం, వాటితో మాట్లాడడం, ఇంటికి వచ్చేస్తున్నాని చెప్పడం చేస్తారట. అంతే కాకుండా మరణం గురించి చాలామందికి తెలియని తనకు తెలుసంటూ జూలీ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com