International: ఐరాస భవనం ముందు భారత వ్యతిరేక పోస్టర్ల కలకలం

జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భవనం ముందు భారత వ్యతిరేక పోస్టర్లు కలకలం సృష్టించాయి. దీంతో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది భారత్. విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం భారత్‌లోని స్విట్జర్లాండ్ రాయబారిని పిలిపించి వివరణ కోరింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఐక్యరాజ్యసమితి భవనం ముందు నిరాధారమైన, దురుద్దేశపూరిత భారత వ్యతిరేక పోస్టర్లను ప్రదర్శించిడంపై నిరసన తెలిపారని అధికారులు తెలిపారు. పో స్టర్లు ప్రదర్శించిన ప్రాంతం అందరికి కేటాయించిన స్థలంలో భాగమని, అయితే, వాటిలోని అంశాలను తాము ఏ విధంగానూ ప్రోత్సహించోమని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. ఇవి తమ దేశ వైఖరిని ప్రతిబింబించవని రాయబారి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. భారత్ ఆందోళనలను అంతే తీవ్రతతో తమ దేశం దృష్టికి తీసుకెళ్తానని విదేశాంగ శాఖకు స్విస్ రాయబారి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com