International: తైవాన్‌పై యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనా

తైవాన్‌పై యుద్ధానికి కాలు దువ్వుతోంది చైనా ! తాజాగా తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా భారీగా యుద్ధ నౌకలను, డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లను మోహరించింది. యుద్ధానికి రిహార్సల్స్‌గా దీన్ని అభివర్ణించింది. శాశ్వత స్వతంత్రదేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. డ్రాగన్ చర్యలతో షిప్పింగ్, ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే చైనా చర్యలను తైవాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా హౌస్ స్పీకర్ మెక్‌కార్టీతో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్‌వెన్ సమావేశమైనందుకు ప్రతీకారంగానే చైనా ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించింది.
తైవాన్ సరిహద్దులో 8 యుద్ధనౌకలతోపాటు, 42 ఫైటర్‌జట్ విమానాలను మోహరించింది చైనా. మరోవైపు తైవాన్‌కు సమీపంలో లుయాన్ సముద్ర తీరంలో ‘లైవ్ ఫైర్ ట్రైనింగ్’ నిర్వహించనుంది చైనా. ఈ క్రమంలో అటువైపుగా వెళ్లే నౌకలపై చైనా నిషేధం విధించింది. ఇలా లైవ్ ఫైర్ ట్రైనింగ్ నిర్వహించడం గడిచిన యాభై ఏళ్లలో ఇదే తొలిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com