Snow Sculpture: అంతర్జాతీయ పోటీలో భారత్‌కు కాంస్యం..ఏ పోటీల్లో అంటే..

Snow Sculpture: అంతర్జాతీయ పోటీలో భారత్‌కు కాంస్యం..ఏ పోటీల్లో అంటే..
X
మంచు శిల్పకళలో మనకు కాంస్యం

అమెరికాలోని కొలరాడోలో జరుగుతున్న 2025 ‘అంతర్జాతీయ మంచు శిల్ప కళా చాంపియన్‌షిప్‌’ పోటీల్లో మనవాళ్లు సత్తా చాటారు.‘మైండ్‌ ఇన్‌ మెడిటేషన్‌’ థీమ్‌తో భారత కళాకారుల బృందం చెక్కిన మంచు శిల్పాలు అంతర్జాతీయ వేదికపై ‘కాంస్య’ పతకాన్ని గెలుచుకున్నాయి. జర్మనీ, మెక్సికో..మొదటి, రెండో స్థానంలో నిలిచాయి.

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ప్రతి ఏటా జనవరి నెలాఖరులో అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ పోటీలు నిర్వహించగా.. భారత్‌కు కాంస్యం దక్కింది. ఈ పోటీల్లో టీమ్ కెప్టెన్ జుహూర్ అహ్మద్.. చెవిటి, మూగ కళాకారుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో తాము కాంస్యం గెలుచుకోవడం ఆనందంగా ఉందని టీమ్ ఇండియా కెప్టెన్ జహూర్ అహ్మద్ చెప్పారు. ఈ ఏడాది తాము 2 ప్రధాన పోటీల్లో పాల్గొన్నామని.. అందులో ఒకటి మిన్నెసోటాలో, రెండోది కొలరాడోలో అని తెలిపారు. భారత్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్‌ల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తే బాగుంటుందని.. స్థానికుల్లో ప్రతిభ బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్ షిప్‌లో వివిధ దేశాల కళాకారులు రూపొందించిన మంచు శిల్పాలను అబ్బురపరిచాయి.

Tags

Next Story