Iran Attacks : ఇజ్రాయెల్ పైకి 30 క్షిపణులతో ఇరాన్ దాడి.. భారీగా ఆస్తినష్టం

X
By - Manikanta |23 Jun 2025 1:00 PM IST
ఇరాన్ లో మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ పైకి ఇరాన్ 30కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) తెలిపాయి. టెల్ అవివ్, హైఫా నగరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో 11 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులను టెల్ అవివ్ ఇచిలోవ్ మెడికల్ సెంటర్లో ఇజ్రాయెల్లో పలు ప్రాంతాలను క్షిపణులు తాకాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక సైరన్లు మోగించకుండానే హైఫాపైకి ఒక క్షిపణి దాడి చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు వెంటనే బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడుల్లో దెబ్బ తిన్న 10 ప్రాంతాల్లో అత్యవసర సేవా బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com